Home  »  TV News  »  Brahmamudi : రేఖ ఆశలపై నీళ్లు చల్లిన నందు ఎంట్రీ.. రాజు పక్కా ప్లాన్!

Updated : Jul 9, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1079 లో..... రాజుకి అపర్ణ ఫోన్ చేసి రేఖ ఆస్తులన్నీ సొంతం చేసుకుంటుందని చెప్తుంది. మీరేం కంగారు పడకండి అమ్మమ్మ.. నేను చూసుకుంటాను.. ఆస్తులు చెయ్యి జరిపోనివ్వనని అపర్ణకి రాజు మాటిస్తాడు. ఆ తర్వాత ఇక ఆస్తులన్నీ మన సొంతం అవుతున్నాయి కదా.. ఒక ఎకరం భూమి కొనాలని శేషుతో భ్రమరాంబ అంటుంది. కలలు రాత్రి కంటే నిజం అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ పగలు కంటే నిజం అవ్వవని అపర్ణ అంటుంది.

ఏంటి నువ్వు అంత కూల్ గా ఉన్నావ్.. నిన్న గొడవ చేసావ్ ఆస్తులు పోతున్నాయని బాధ లేదా అని భ్రమరాంబ అంటుంది. ఆస్తులు ఎక్కడికి పోవని అపర్ణ అంటుంది. అప్పుడే రేఖ వస్తుంది. లాయర్ వస్తున్నాడు వెళ్లి ఇందుని రెడీ అవ్వమని చెప్పమని రేఖ అనగానే చెప్తాను కానీ ఆఫీస్ కి వెళ్లాడానికి రెడీ అవ్వమని చెప్తానని అపర్ణ అనేసి వెళ్ళిపోతుంది. ఏంటి తను అంత దైర్యం గా మాట్లాడుతుంది. ఏదైనా ప్లాన్ చేశారంటావా అని భ్రమరంభ అనగానే వాళ్ళకి అంత సీన్ లేదని రేఖ అంటుంది. ఆ తర్వాత ఇందు, స్వాతి టెన్షన్ పడుతారు. నా మనవడు వచ్చి ఆస్తులు వెళ్ళనివ్వకుండా చేస్తానని మాటిచ్చాడని అపర్ణ చెప్పగానే అతనికి ఎందుకు చెప్పావని ఇందు అంటుంది.

మరొకవైపు లాయర్ వస్తాడు. ఇందు కిందకి వస్తుంది. ఆస్తి పేపర్స్ పై ఇందు సంతకం చేయబోతుంటే నందు వస్తుంది. సంతకం తను మాత్రమే పెడితే సరిపోదని అనడంతో రాజు పెట్టాడని రేఖ అంటుంది. మరి నువ్వు పెట్టాలా ఏంటని భ్రమరాంబ అనగానే అవునని నందు అంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఇంట్లో నుంచి తప్పిపోయిన నందు నేనే అని నందు చెప్పగానే అందరు షాక్ అవుతారు. నువ్వే నందు అని మేం ఎలా నమ్మలని భ్రమరాంబ అడుగుతుంది. తరువాయి భాగంలో నీకు ఇదంతా ఎవరు చెప్పారని నందుని ఇందు అడుగుతుంది. నీ మొగుడు ఫోన్ చేసి చెప్పాడని నందు చెప్తుంది. ఆ తర్వాత ఇందుకి రాజు ఫోన్ చేసి ఎప్పటికి నీ భర్త నేనే అని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.